Amarnath Yatra 2023: అమర్‌నాథ్ యాత్ర మొదలైంది.. ఎలా వెళ్లాలంటే..

Amarnath Yatra 2023: 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 1 న మొదలై ఆగస్టు 31న ముగుస్తుంది.

Advertisement
Update:2023-06-18 11:37 IST

Amarnath Yatra 2023: అమర్‌నాథ్ యాత్ర మొదలైంది.. ఎలా వెళ్లాలంటే..

Amarnath Yatra 2023 | ఏడాదికొకసారి జరిగే అమర్‌నాథ్ యాత్రకు సమయం రానే వచ్చింది. మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతానికి కేవలం వేసవిలో మాత్రమే వెళ్లేందుకు వీలుంటుంది. మంచు పర్వతాల మీదుగా నడిచి ఈ ప్రాంతానికి చేరుకోవాలి.

62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 1 న మొదలై ఆగస్టు 31న ముగుస్తుంది. రిజిస్ట్రేషన్లు ఇప్పటికే మొదలయ్యాయి.

ఈ యాత్ర కోసం ఆన్‌లైన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్, పీఎన్‌బీ బ్యాంక్, యస్ బ్యాంక్‌లతో పాటు ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లలో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు.


ఎత్తైన హిమాలయాల మధ్యలో మంచు లింగం రూపంలో దర్శనం ఇచ్చే శివుడ్ని చూడడం కోసం ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు అమర్‌నాథ్ యాత్రకు వస్తుంటారు. ఈ యాత్రలో 3888 మీటర్ల ఎత్తులో ఉన్న గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు శివ లింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. చంద్రమాన చక్రం ఆధారంగా ఈ మంచు లింగం పెరగడం, తగ్గడం జరుగుతుంటుందని చెప్తుంటారు. శివుడు పార్వతీ దేవికి అమరత్వ రహస్యం గురించి చెప్పిన చోటుగా అమర్ నాథ్ ప్రసిద్ధి.




ఈ యాత్రకోసం వచ్చే ప్రయాణికుల కోసం ప్రభుత్వం బస కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అమర్‌నాథ్ యాత్రకోసం భక్తులు మందుగా శ్రీనగర్ ఎయిర్ పోర్టుకి చేరుకోవాలి. ఈ యాత్రలో ఉండే కనిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

Tags:    
Advertisement

Similar News