తెలంగాణ హిడెన్ వాటర్ ఫాల్స్ ఇవీ..
తెలంగాణలో వాటర్ ఫాల్స్ అనగానే చాలమందికి బొగతా, కుంతల జలపాతాలే గుర్తొస్తాయి. అయితే ఎవరూ అంతగా ఎక్స్‌ప్లోర్ చేయని హిడెన్ వాటర్ ఫాల్స్ తెలంగాణలో చాలానే ఉన్నాయి.
తెలంగాణలో వాటర్ ఫాల్స్ అనగానే చాలమందికి బొగతా, కుంతల జలపాతాలే గుర్తొస్తాయి. అయితే ఎవరూ అంతగా ఎక్స్‌ప్లోర్ చేయని హిడెన్ వాటర్ ఫాల్స్ తెలంగాణలో చాలానే ఉన్నాయి. ఈ సీజన్‌లో చూడదగ్గ కొన్ని అందమైన జలపాతాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
బోడకొండ ఫాల్స్
హైదారాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడకొండ వాటర్ ఫాల్స్ గురించి చాలామందికి తెలియదు. ఇది నాగార్జున సాగర్ హైవే రూట్‌లో ఉంటుంది. గుంగల్ గ్రామానికి13 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాతం పచ్చదనంతో కనువిందు చేస్తుంది. చుట్టూ కొండల మధ్య పరవళ్లు తొక్కే ఈ జలపాతం మంచి వీకెండ్ స్పాట్.
ఎత్తిపోతల ఫాల్స్
నాగార్జున సాగర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం పచ్చని ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. నక్క వాగు, తుమ్మల వాగు, చంద్రవంక వాగు అనే మూడు వాగులు కలిసి అందమైన జలపాతంగా ఏర్పడిన చోటు ఇది. ఈ జలపాతం హైదరాబాద్ నుంచి 163 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పోచెర ఫాల్స్
తెలంగాణలోని వెడల్పాటి జలపాతాల్లో పోచెర జలపాతం ఒకటి. ఇది నిర్మల్‌కు 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ అందమైన కొండలు పచ్చని మైదానాల మధ్య ఉండే ఈ సుందరమైన జలపాతం.. తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్..
కొంగళ ఫాల్స్
ఏటూరునాగారం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంగళ జలపాతానికి ట్రెక్కింగ్ చేసి చేరుకోవాలి. స్థానికుల సాయంతో ట్రెక్కింగ్ రూట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ‘వి–ఫాల్’ అని కూడా అంటారు. ఇక్కడి జలధార మధ్యలో రెండుగా విడిపోయి కనిపిస్తుంది. సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి పడే జలపాతం వాటర్ ఫాల్స్ లవర్స్‌ను కట్టిపడేస్తుంది.