సీనియర్ సిటిజన్స్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తలు ఇలా..
రిటైర్ అయిన తర్వాత చాలామంది సీనియర్ సిటిజన్స్‌కు ప్రయాణాలు చేయాలని ఉంటుంది. కానీ, వాళ్లకుండే రకరకాల ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్, సేఫ్టీ ఇష్యూస్ కారణంగా చాలామంది ప్రయాణాలను అవాయిడ్ వేస్తుంటారు. లేదా పూర్తిగా క్యాన్సిల్ చేసుకుంటారు.
రిటైర్ అయిన తర్వాత చాలామంది సీనియర్ సిటిజన్స్‌కు ప్రయాణాలు చేయాలని ఉంటుంది. కానీ, వాళ్లకుండే రకరకాల ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్, సేఫ్టీ ఇష్యూస్ కారణంగా చాలామంది ప్రయాణాలను అవాయిడ్ వేస్తుంటారు. లేదా పూర్తిగా క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సీనియర్స్ కూడా ఎంచక్కా ప్రయాణాలు చేయొచ్చు. అదెలాగంటే..
సీనియర్ సిటిజన్స్ ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు సరైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. రద్దీ తక్కువ ఉండేప్రాంతాలను ఎంచుకోవాలి. అలాగే ప్రయాణంలో అలసట లేకుండా ట్రైన్ లేదా ఫ్లైట్ మార్గాలు ఎంచుకోవాలి.
హెల్త్ ఇష్యూస్‌తో బాధ పడేవాళ్లు జర్నీ చేసేముందు తమ హెల్త్ కండిషన్‌ను చెక్ చేసుకోవాలి. అనారోగ్యం వల్ల ప్రయాణంలో ఇబ్బందులు రావొచ్చు. అందుకే బయలుదేరే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. కావాల్సిన మెడిసిన్స్ అడిగి తీసుకోవాలి.
ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుంటే ట్రావెల్ చేసేటప్పుడు మెడికల్ డిస్క్రిప్షన్స్, మందులు, మెడికల్ కిట్, స్నాక్స్, నీళ్లు ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి.
సీనియర్స్ ప్రయాణాలు చేసేటప్పుడు వెళ్తున్న ప్రదేశం గురించి ముందే తెలుసుకుని బయలుదేరాలి. బుకింగ్స్ అన్ని ముందే చేసుకోవాలి. హోటల్ రూం, రిటర్న్ టికెట్లు, లోకల్ వెహికల్, గైడ్ వంటివాటిని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి.
సీనియర్స్ ఒంటరిగా ట్రావెల్ చేసేటప్పుడు బయట ప్రదేశాల కంటే తెలిసిన వాళ్ల దగ్గర స్టే చేయడం మంచిది. కుదరకపోతే హోమ్ స్టే లేదా గెస్ట్ హౌస్‌లను ఎంచుకోవాలి.
సీనియర్స్ ఫ్లైట్ జర్నీ చేయాల్సి వస్తే హెల్త్ సర్టిఫికెట్ దగ్గర పెట్టుకోవాలి. -తక్కువ లగేజీ తీసుకెళ్లాలి. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిది.
అన్నింటికంటే ముఖ్యంగా సీనియర్స్ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెళ్లబోయే ప్రాంతంలో దొరికే ఫుడ్ గురించి ముందే తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు డైట్ ప్లాన్ చేసుకోవాలి.
సీనియర్స్ ట్రావెల్ చేసేముందు వెళ్లబోతున్న ప్రదేశం గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాలి. మొబైల్ కనెక్టివిటీ ఉండే ప్లేసులనే ప్రయాణానికి ఎంచుకోవాలి. పుణ్యక్షేత్రాల వంటివాటికి వెళ్లేటప్పుడు రద్దీ తక్కువ ఉండే సీజన్‌లో ప్రయాణం పెట్టుకోవాలి.