వింటర్‌లో చేయాల్సిన వైల్డ్ సఫారీలు ఇవే!
వింటర్ సీజన్.. వైల్డ్ లైఫ్ సఫారీలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో పులులు, ఏనుగులు, చిరుతల వంటివి ఎక్కువగా బయటకు వస్తుంటాయి.
వింటర్ సీజన్.. వైల్డ్ లైఫ్ సఫారీలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో పులులు, ఏనుగులు, చిరుతల వంటివి ఎక్కువగా బయటకు వస్తుంటాయి. కాబట్టి వైల్డ్ లైఫ్‌ను ఇష్టపడేవాళ్లు డిసెంబర్, జనవరి నెలల్లో వైల్డ్ లైఫ్ సఫారీలు ప్లాన్ చేసుకోవచ్చు.
మనదేశంలో వైల్డ్ లైఫ్ సఫారీలు చేసేందుకు బోలెడు ఆప్షన్లు ఉన్నాయి. రకరకాల నేషనల్ పార్క్ లు వైల్డ్ లైఫ్ సఫారీలను ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో చూడదగ్గ కొన్ని బెస్ట్ నేషనల్ పార్క్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
రంతంబోరె నేషనల్ పార్క్
రాజస్తాన్ లో ఉన్న రంతంబోరె నేషనల్ పార్క్‌లో బెంగాల్ టైగర్స్ సంతతికి చెందిన పులుల సంచారం ఉంటుంది. వింటర్ సీజన్‌లో ఇక్కడి ఎకో సిస్టమ్ పూర్తిగా మారిపోతుంది. సరస్సులు నీటితో నిండిపోతాయి. కాబట్టి జంతువులు తరచూ బయటకు వస్తుంటాయి. అందుకే ఈ సీజన్‌లో ఇక్కడ సఫారీ చేస్తే పులులు, చిరుతలు, ఎలుగు బంట్లతో పాటు రకరకాల పక్షులను సందర్శించొచ్చు.
జిమ్‌కోర్బెట్ నేషనల్ పార్క్
ఉత్తరాఖండ్‌లో ఉన్న పాపులర్ నేషనల్ పార్క్స్‌లో జిమ్ కోర్బెట్ నేషనల్ పార్క్ ఒకటి. ఇది వింటర్ సఫారీలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఇక్కడి క్లైమెట్ ఎంతో ఆహ్లాదకరంగా వైల్డ్ లైఫ్‌తో నిండిపోతుంది. ఇక్కడ ఏనుగులు, పులులు, రకరకాల పక్షులను చూసే వీలుంటుంది.
కజిరంగా నేషనల్ పార్క్
అస్సాంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్.. వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో ఒకటి. ఇది ఒంటి కొమ్ము రైనోలు నివసించే ప్రాంతం.వింటర్ సీజన్‌లో ఈ పార్క్ మరింత సుందరంగా ముస్తాబవుతుంది. రైనోలు, ఏనుగులు, పులులు, నీటి పక్షులను ఇక్కడ చూడొచ్చు.
బందీపూర్ నేషనల్ పార్క్
కర్నాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్.. పులులను విజిట్ చేయడానికి బెస్ట్ ప్లేస్. ఈ సీజన్‌లో ఇక్కడ ఏనుగుల గుంపులు, ఇండియన్ లెపర్డ్ వంటివి చూడొచ్చు. అంతేకాదు ఈ పార్క్ పక్షులకు ప్యారడైజ్. రకరకాల అడవి పక్షులను ఇక్కడ చూడొచ్చు.
సుందర్బన్స్ నేషనల్ పార్క్
వెస్ట్ బెంగాల్‌లో ఉన్న సుందర్బన్స్ నేషనల్ పార్క్.. వింటర్‌లో జీవం పోసుకుంటుంది. ఇక్కడ సఫారీ అంటే నదుల మీద బోట్‌లో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్స్‌తో పాటు రకరకాల పక్షులు, మొసళ్లు వంటి ఎన్నో రకాల జీవజాతులను ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు.
గిర్ నేషనల్ పార్క్
గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్.. సింహాలకు ఫేమస్. వింటర్ సీజన్‌లో ఇక్కడ సింహాలు బయటకు వస్తాయి. సింహాలతో పాటు చిరుతలు, దుప్పుల వంటివాటిని కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చు.