హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న బెస్ట్ టూరిస్టు ప్లేసులివే..

పని ఒత్తిడితో విసిగిపోతున్న చాలామంది వీకెండ్‌లో ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలనుకుంటారు. కానీ, ఒకట్రెండు రోజుల్లో ఎక్కడికి వెళ్లలేక టూర్ ప్లాన్ వాయిదా వేస్తుంటారు. అయితే హైదరాబాద్‌కు చుట్టుపక్కలే బోలెడు అందమైన ప్రదేశాలున్నాయి.

Advertisement
Update:2023-08-18 11:00 IST

హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న బెస్ట్ టూరిస్టు ప్లేసులివే..

పని ఒత్తిడితో విసిగిపోతున్న చాలామంది వీకెండ్‌లో ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలనుకుంటారు. కానీ, ఒకట్రెండు రోజుల్లో ఎక్కడికి వెళ్లలేక టూర్ ప్లాన్ వాయిదా వేస్తుంటారు. అయితే హైదరాబాద్‌కు చుట్టుపక్కలే బోలెడు అందమైన ప్రదేశాలున్నాయి. కేవలం ఒకట్రెండు రోజుల్లో వెళ్లి రావొచ్చు. అలాంటి కొన్ని బెస్ట్ ప్లేసులు ఇప్పుడు చూద్దాం.

సిటీలో ఉండేవాళ్లు పచ్చదనాన్ని, స్వచ్ఛమైన గాలిని మిస్ అవుతుంటారు. అందుకే కనీసం నెలకోసారైనా ట్రిప్ వెళ్తే బాగుంటుంది. కాసేపు అలా నేచర్‌‌కు దగ్గరగా గడిపితే మసనుకి ప్రశాంతత లభిస్తుంది. అలాగని దానికోసం ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన పని లేదు. హైదరాబాద్ నుంచి నాలుగైదు గంటల లోపు చేరుకోగలిగే ప్లేసులు కొన్ని ఉన్నాయి.

శామీర్‌పేట్‌ లేక్‌..

సికింద్రాబాద్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉండే శామీర్‌‌పేట్ లేక్ మంచి వీకెండ్ డెస్టినేషన్. ఇక్కడ అందమైన లేక్ తో పాటు విశాలమైన పార్క్ కూడా ఉంది. ఈ పార్క్‌లో జింకలు, నెమళ్లతో పాటు రకరకాల పక్షులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో లగ్జరీ రెస్టారెంట్లు, రిసార్టులు కూడా అందుబాటులో ఉన్నాయి.

కొండపోచమ్మ డ్యామ్

హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్ ఎంతో అందమైన ప్రదేశం. ఇక్కడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ క్యాపింగ్ చేసే వెసులుబాటు కూడా ఉంది.

దిండి

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో 108 కిలోమీటర్ల దూరంలో ఉండే దిండి.. బెస్ట్ వీకెండ్ స్పాట్. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు గోదావరి నదీ అందాలను కూడా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నచిన్న ట్రెక్కింగ్స్ వంటివి కూడా చేయొచ్చు. ఇక్కడ లగ్జరీ రిసార్టులు, హోటళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసేందుకు ఇది బెస్ట్ ప్లేస్‌.

అనంతగిరి హిల్స్

హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉండే అనంతగిరి కొండలు.. ప్రకృతి ప్రేమికులకు బాగా నచ్చే ప్లేస్. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పచ్చని కొండలు, అడవులు కనువిందు చేస్తాయి. ఇక్కడి కొండలపై ట్రెక్కింగ్ చేయొచ్చు. నైట్ క్యాపింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

రాచకొండ కోట..

సిటీకి దగ్గర్లో ఉన్న మరో బెస్ట్ వీకెండ్ స్పాట్ రాచకొండ. ఇది హైదరాబాద్ నుంచి నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 14వ శతాబ్దానికి చెందిన కోట స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడి కొండలపై ట్రెక్కింగ్‌ చేయొచ్చు.

కీసర

సిటీ శివార్లలో ఉన్న కీసర కూడా మంచి వీకెండ్ స్పాట్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాచీన రామిలింగేశ్వర ఆలయం ఆధ్యాత్మిక ప్రాంతంగా ప్రసిద్ధి. కొండ ప్రాంతంలో ఉండే ఈ ప్లేస్ వానాకాలం సీజన్‌లో పచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంత్రం టైంలో అలా వెళ్లిరావడానికి ఇది అనువైన ప్లేస్.

ఇవి కూడా..

ఇక వీటితోపాటు రెండు రోజులు టైం ఉందనుకుంటే హైదరాబాద్‌ నుంచి 200 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న శ్రీరాంసాగర్, శ్రీశైలం, నల్లమల అడవులు, లక్నవరం వంటి ప్రాంతాలకు కూడా టూర్ ప్లాన్ చేయొచ్చు. అలాగే ఏరోజైనా సాయంత్రం సమయాల్లో వెళ్లిరావడానికి అనుకూలంగా సిటీ చుట్టూ బోలెడు థీమ్ పార్కులు అందుబాటులో ఉన్నాయి. రావిర్యాలలోని వండర్‌ లా, శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకి దగ్గర్లోని ఎస్కేప్‌ అడ్వెంచర్‌ వాటర్‌ థీమ్‌ పార్క్, శంకర్‌పల్లిలోని వైల్డ్‌ వాటర్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్క్, వికారాబాద్‌కు దగ్గర్లోని డ్రీమ్‌ వ్యాలీ వాటర్‌ పార్క్, కండ్లకోయ ఆక్సిజన్‌ పార్క్, కొత్తగూడలో ఉన్న బొటానికల్‌ గార్డెన్స్‌ వంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News