ప్రయాణాలకు రెడీ అవ్వండిలా...

సమ్మర్‌‌లో చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.

Advertisement
Update:2024-05-18 06:00 IST

సమ్మర్‌‌లో చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అవేంటంటే..

సమ్మర్ వెకేషన్‌లో లాంగ్ టూర్స్ వెళ్లేవాళ్లు పక్కా ప్రణాళికతో బయలుదేరాలి. ఫ్యామిలీతో టూర్ వెళ్లేటప్పుడు అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.

ముందుగా వెళ్లబోయే ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అక్కడ లోకల్ ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్, స్టే సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ‘అక్కడికెళ్లాక చూసుకోవచ్చులే’ అన్న ధోరణి అంత మంచిది కాదు.

ప్రయాణాలు చేసేటప్పుడు లగేజీ ఎంత తక్కువగా ఉంటే టూర్ అంత సుఖంగా సాగుతుంది. కాబట్టి లగేజీ విషయంలో స్మార్ట్‌గా వ్యవహరించాలి. మల్టీ పర్పస్‌గా ఉపయోగపడే వస్తువులను ప్యాక్ చేసుకోవాలి. కంఫర్టబుల్‌గా ఉండే బట్టలు తీసుకెళ్లాలి. బయట సులభంగా లభించేవాటిని ఇక్కడ్నుంచి మోసుకుంటూ తీసుకెళ్లాల్సిన పని లేదు. కాబట్టి ఇన్‌స్టంట్ ఫుడ్, పేస్టులు, బ్రష్‌లు, సబ్బులు వగైరా వంటి వాటిని స్కిప్ చేస్తేనే బెటర్.

ఫ్యామిలీతో ప్రయాణాలు చేసేటప్పుడు అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెడిసిన్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాటర్ బాటిల్స్ వంటివి తప్పక తీసుకెళ్లాలి.

దూర ప్రయాణాలు చేసేవాళ్లు సేఫ్టీపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎక్కడికెళ్లినా ఇంట్లో వాళ్లతో కమ్యూనికేషన్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. మొబైల్‌లో తగిన రోమింగ్, ఇంటర్నెట్ ప్యాక్‌లు రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే వెంట కొంత లిక్విడ్ క్యాష్ క్యారీ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దూర ప్రాంతాల్లో ఇబ్బందుల లేకుండా ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News