కోమటిరెడ్డి సంచలనం.. బీజేపీకి గుడ్‌బై చెప్పేస్తారా..!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరతారని ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై మునుగోడులో పోటీ చేసేందుకు కోమటిరెడ్డి ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

Advertisement
Update:2023-10-23 11:47 IST

కోమటిరెడ్డి సంచలనం.. బీజేపీకి గుడ్‌బై చెప్పేస్తారా..!

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..! అంటే అవుననే చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన త్వ‌ర‌లోనే బీజేపీకి గుడ్‌ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈనెల 25న ప్రకటన చేయనున్నారని స‌మాచారం. ఈనెల 26న మునుగోడులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంది. అంతకుముందు రోజే కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీకి రాజీనామా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరతారని ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై మునుగోడులో పోటీ చేసేందుకు కోమటిరెడ్డి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కొంతకాలంగా బీజేపీ నాయ‌క‌త్వంపై కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం పెద్దగా హాజరుకావడం లేదు. ఇటీవల ప్రధాని మోడీ బహిరంగ సభల్లోనూ కోమటిరెడ్డి కనిపించలేదు. బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లోనూ కోమటిరెడ్డికి చోటు దక్కలేదు.

మరోవైపు మునుగోడు కాంగ్రెస్ టికెట్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుడు చలమల్ల కృష్ణారెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ కోమటిరెడ్డి పార్టీలో చేరితే కృష్ణారెడ్డికి పార్టీ పెద్దలు నచ్చచెప్తారని సమాచారం. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో మనుగోడు నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచిన రాజగోపాల్ రెడ్డి.. 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తర్వాత జరిగిన ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి.. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

Tags:    
Advertisement

Similar News