ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ కమిటీ సమావేశం
సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ కమిటీ సమావేశం అయింది
సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై కేబినేట్ సబ్‌కమిటీ సమావేశం ఛైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభం అయింది. ఈ సమావేశంలో కమీటీ వైస్ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ కూడా ఉత్తమ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక అందజేసింది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై విశ్రాంత అధికారి బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
ఈ క్రమంలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి వీలుగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి, కేంద్రానికి పంపనున్నట్లు తెలిసింది. అలాగే ఎస్సీ వర్గీకరణపైనా అసెంబ్లీలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.