బీఆర్‌ఎస్ నాయకులు ఉప ఎన్నికలకు సిద్ధం కండి : కేటీఆర్‌

బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Advertisement
Update:2025-02-03 16:30 IST

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్దం కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్టర్‌లో సంచలన ట్వీట్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం గత తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్‌ఎస్ శాసన సభ్యలపై అనర్హత వేటు పడుతుందని ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం అసాధ్యమని కేటీఆర్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్‌ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు.

స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్‌ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. దానం నాగేందర్ , కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు ల అనర్హత పిటిషన్లతో కలిపి విచారిస్తామని సుప్రీం కోర్ట్ ధర్మాసనం పేర్కొన్నాది. ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి కి అందజేయాలని సుప్రీం ఆదేశించింది. అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు.

Tags:    
Advertisement

Similar News