సమగ్ర ఇంటింటి సర్వేలో వ్యక్తిగత వివరాలు ఎందుకు? : తమ్మినేని

సర్వేలో వ్యక్తిగత వివరాల ప్రశ్నలను మినహాయించాలని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Advertisement
Update:2024-11-13 17:26 IST

తెలంగాణలో సమగ్ర ఇంటింటి సర్వేలో వ్యక్తిగత ప్రశ్నలకు సంబంధించిన వివరాలు వెల్లడిరచడానికి ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్మి తమ్మినేని వీరభద్రం అన్నారు. కొన్ని ప్రాంతల్లో ఎదురు తిరుగుతున్నట్లు, దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేషన్ కార్డులు తొలగించడానికి, సంక్షేమ పథకాలు రద్దు చేయడానికే సర్వే చేస్తున్నారని ప్రజల్లో సందేహాలు రేకెత్తుతున్నాయిని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల సర్వే చేస్తున్న వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లను అనుమానించే సందర్భాలు కూడా వున్నాయి.

అందువల్ల ప్రభుత్వం స్పందించి, అఖిలపక్ష సమావేశం నిర్వహించి నివృత్తి చేయాలని కోరుతున్నాం అని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ సర్వే పత్రం లో కులంతో పాటు ఆస్తులు, రాజకీయ, వ్యవసాయ భూములకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో కూడిన ప్రశ్నలున్నాయి. ఆ వివరాలను ఇవ్వడానికి పలు అనుమానాలు, వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అటువంటి ప్రశ్నలను మినహాయించాలని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది అని తమ్మినేని వీరభద్రం అన్నారు.

Tags:    
Advertisement

Similar News