నిజమైన హీరోలు టీచర్లే : పవన్‌ కల్యాణ్‌

తన దృష్టిలో నిజమైన హీరోలు టీచర్లే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Advertisement
Update:2024-12-07 16:49 IST

 హీరోలను సినిమాల్లోనే కాకుండా టీచర్లలోనూ చూసుకోవాలని విద్యార్థులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కడపలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సింహం గడ్డం గీసుకుంటది నేను గీసుకోను అని డైలాగులు చెబితే వెనుక రీరికార్డింగ్‌లు వస్తాయి.. సినీ హీరోలు నడిస్తే రీరికార్డింగ్‌లు ఉంటాయని అన్నారు. కానీ కార్గిల్‌లో చనిపోయిన వారికి, ఉపాధ్యాయులకు రీరికార్డింగ్‌లు ఉండవని అన్నారు. కానీ వారే నిజమైన హీరోలని.. వారిని గౌరవించాలని పవన్ సూచించారు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాదని.. సాహిత్యానికి నిలయమని పవన్ కళ్యాణ్ కొనియాడారు.

సరైన చదువు లేకపోతే సమాజం ముందుకు నడవడం కష్టమని పవన్‌ అన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా మెలగాలని సూచించారు. పేరెంట్స్, టీచర్ల మధ్య సమన్వయం పెరగాలని అన్నారు. దేశం బాగుండాలంటే అధ్యాపకులపై పెట్టబడులు పెట్టాలని అభిప్రాయపడ్డారు. అందరికంటే టీచర్లకు ఎక్కువ జీతం ఉండాలనేది తన కోరిక అని చెప్పారు. సమాజంలో సైబర్‌ క్రైమ్‌ రోజురోజుకూ పెరుగుతుందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. సోషల్‌మీడియాపై అదనపు ఆంక్షలు ఉండేలా కేంద్రాన్ని కోరతానని చెప్పారు. ఆస్ట్రేలియా తరహాలో సోషల్‌మీడియా చట్టాలు తీసుకొస్తామని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News