తెలంగాణ: 1,521 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ కేంద్రాలు

12 జిల్లాల్లో రూ.32 కోట్లతో 1,521 పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్యానెళ్ల ద్వారా మొత్తం 3,072 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSREDCO) ఈ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు టెండర్లు వేసి 11 మందిని ఖరారు చేసింది.

Advertisement
Update:2022-12-21 08:20 IST

రాష్ట్రవ్యాప్తంగా 1,521 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల ప్రాంగణంలో సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఆయా పాఠశాలలకు ఉచిత విద్యుత్ లభించడమే కాక ఆదాయం కూడా వస్తుంది.

పాఠశాలల్లో ఉత్పత్తి అయ్యే అదనపు సౌరవిద్యుత్‌ను విద్యుత్‌ గ్రిడ్‌కు బదిలీ చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు.

12 జిల్లాల్లో రూ.32 కోట్లతో 1,521 పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్యానెళ్ల ద్వారా మొత్తం 3,072 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSREDCO) ఈ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు టెండర్లు వేసి 11 మందిని ఖరారు చేసింది.

"ప్రతి పాఠశాలలో నెట్ మీటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సెలవు రోజుల్లో ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్ నేరుగా గ్రిడ్‌కు బదిలీ చేయబడుతుంది. బదిలీ చేయబడిన యూనిట్లు, ధరపై ఆధారపడి, పాఠశాలలకు తదనుగుణంగా డబ్బులు చెల్లిస్తారు. ప్రస్తుతం, ఒక యూనిట్ ధర రూ.4.52, ఇది డైనమిక్ ధర. ఈ నెలాఖరు నాటికి 60 పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని భావిస్తున్నాం'' అని TSREDCO అధికారి ఒకరు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడిలో భాగంగా సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ఈ పాఠశాలలను ఎంపిక చేశారు.

11 జిల్లాలలో, మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 283 పాఠశాలల్లో సోలార్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత నిజామాబాద్‌లో 145, రంగారెడ్డి జిల్లాలో 141 పాఠశాలలు ఉన్నాయి.

సోలార్ పివి పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడమే కాకుండా, మనుషుల నుండి గానీ పశువుల నుండి గానీ పరికరాలకు ఎటువంటి నష్టం జరగకుండా వాటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్‌లను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News