భారత రాజ్యాంగంపై 26న తెలంగాణ జాగృతి సెమినార్
గణతంత్ర భారత్ - జాగ్రత్త భారత్ పేరుతో నిర్వహణ
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 ఏళ్లవుతున్న సందర్భంగా తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈనెల 26న ''గణతంత్ర భారత్ - జాగ్రత్త భారత్'' పేరుతో సదస్సు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించే సెమినార్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ఉపన్యాసం చేయనున్నారు. సదస్సు పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించడం, సవాళ్లు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, మహిళా సాధికారత, మైనార్టీలు, బలహీనవర్గాలు, కులగణన లాంటి 16 అంశాలపై సెమినార్ లో చర్చించనున్నారు. ఈ సదస్సుకు ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని జాగృతి విద్యార్థి విభాగం నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు చరణ్ పసుల, శ్రీకాంత్ గౌడ్, లింగం, డాక్టర్ సత్య, వసుమతి, కృష్ణ కిషోర్, శ్రీనివాస్ గౌడ్, మాడ హరీశ్ రెడ్డి, జన్ము రాజు, అశోక్ యాదవ్, గాజుల అరుణ్ పాల్గొన్నారు.