తెలంగాణ కాంగ్రెస్ నేతల పాదయాత్రలు: ఒకరు తూర్పుకు మరొకరు పడమరకు

కొత్తగా వచ్చిన ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ ఠాక్రే తెలంగాణలోని ముఠా తగాదాలసంస్కృతిని మార్చి ఒక కొలిక్కి తెస్తాడనే భ్రమతో అధిష్టానం ఆయనను పంపించింది. అయినా సరే ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ ఒకరు తూర్పుకు నడిస్తే , మరొకరు పడమరకు నడక సాగిస్తూనే ఉన్నారు.

Advertisement
Update:2023-02-14 15:15 IST

కాంగ్రెస్ అంటేనే ముఠా తగాదాలకు పేరెన్నికగలది. ఎవరు పీసీసీఅధ్యక్షులైనా సరే వాళ్ళకు వ్యతిరేకంగా రెండు మూడు గ్రూపులు తయారవుతాయి. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన సంస్కృతి కాదు. అది వాళ్ళ తరతరాల సంస్కృతి. అలాంటి సంస్కృతిని కాదని ఒక్కరోజులో అందరినీ ఐక్యమవమంటే వాళ్ళ‌కు మాత్రం కష్ట‍ కదా!

కొత్తగా వచ్చిన ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ ఠాక్రే తెలంగాణలోని ముఠా తగాదాలసంస్కృతిని మార్చి ఒక కొలిక్కి తెస్తాడనే భ్రమతో అధిష్టానం ఆయనను పంపించింది. అయినా సరే ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ ఒకరు తూర్పుకు నడిస్తే , మరొకరు పడమరకు నడక సాగిస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం ఆ పార్టీలో పాదయాత్రల జోష్ నడుస్తోంది. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర తో దేశవ్యాప్తంగా ఆపార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో పాదయాత్రలపై మోజు పెరిగింది. తమను అధికారంలోకి తీసుకొచ్చేది పాదయాత్రమే అని నమ్మకం కుదిరింది. అందుకే 'హాత్‌ సే హాత్‌ జోడో' పేరుతో నేతలు జనాల్లోకి వెళ్ళాలని అధిష్టానం ఆదేశించింది.

అయితే తెలంగాణలో హాత్ సే హాత్ కలపాల్సిన నాయకులు ఎడమొహం పెడమొహంగా ఉండటమే కాక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన యాత్రలో ఒక్క సీనియర్ కూడా పాల్గొనడం లేదు.

ఎవరికి వారు తమ వ్యక్తిగత యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యనేతలంతా ఒకరు తూర్పుకు నడిస్తే మరొకరు పడమరకు నడవాలని డిసైడ్ అయిపోయారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉమ్మ డి వరం గల్ జిల్లా నుం చి ఉమ్మ డి ఖమ్మం జిల్లాలోకి ఎంటర్ అయ్యిం ది. కానీ అందులో ఒక్కరు కూడా సీనియర్ నేతలు కనిపించడంలేదు. సీఎల్పీ నేత, ఖమ్మం జిల్లాకు చె‍ందిన భట్టి విక్రమార్క యాత్రవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి కానీ రేవంత్ పాదయాత్ర జరుగుతున్న విషయాన్ని గుర్తించడానికే సిద్దంగా లేరు.

సమస్య అక్కడితోనే ఆగలేదు రేవంత్ వ్యతిరేక వర్గంలో ఉన్న దొంతి మాధవరెడ్డి తన నియోజక వర్గమైన నర్సంపేటకు రావద్దని రేవంత్ కు అల్టిమేటం జారీ చేశారు. దాంతో రేవంత్ తప్పని సరి పరిస్థితుల్లో వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళడానికి మరో మార్గం వెతుక్కోవాల్సి వచ్చింది.

ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వెంకట్ రెడ్డి తదితరులు తాము కూడా యాత్రలు చేస్తామని ఏఐసీసీకి చెప్పారు. కానీ ఇప్పటి వరకు షెడ్యూల్ మాత్రం ఇవ్వలేదు.

మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలున్నందున భట్టి పాదయాత్ర మొదలు పెట్టలేదు. ఇప్పుడిక శివరాత్రి తర్వాత పాదయాత్ర మొదలుపెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారట. ఇక పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక తాను కూడా పాదయాత్ర మొదలు పెట్టాలని ఉత్తమ్ ప్లాన్ చేసుకుంటున్నాడట. తన పార్లమెం టు నియోజకవర్గం తో పాటుగా.. కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఉత్తమ్ ఫోకస్‌ పెడతారని సమాచారం .ఇక తాను బైక్ యాత్ర చేస్తానని కోమటి రెడ్ది ప్రకటించారు. ఖమ్మం , మహబూబ్‌నగర్, నల్గొం డ జిల్లాలో తిరుగుతానని కూడా ఆయన చెప్పారు.

అయితే ఆయనను మిగతా జిల్లాల్లోకి అతని వ్యతిరేకులు అనుమతిస్తారా అనేది అనుమానమే.

ఇలా కాంగ్రెస్ నాయకులంతా ఎవరిదారిన వారు వాళ్ళకిష్టమొచ్చిన ప్రాంతాల్లో పాదయాత్రలు , బైక్ యాత్రలు చేయడానికి సిద్దమవుతుండగా, వీళ్ళ మధ్య సరిహద్దు గొడవలు మాత్రం ఇంకా తెగలేదు. ఇ‍లాంటి పరిస్థితుల్లో అసలు ఈ కాంగ్రెస్ నేతల పాదయాత్రలు ఎంత వరకు విజయవంతం అవుతాయి? అనుకున్నమేర వాళ్ళు పాదయాత్ర చేయగల్గుతారా ? 'ఎవరికి వారే యమునా తీరే' అన్నట్టుగా ఉన్న ఈ నాయకులను అసలు జనాలు నమ్ముతారా? అనే ప్రశ్నలు సగటు కాంగ్రెస్ కార్యకర్త మెదళ్ళను తొలుస్తున్నాయి. 

Tags:    
Advertisement

Similar News