రేవంత్ రిజైన్‌.. మల్కాజ్‌గిరి ప్రజలకు భావోద్వేగ లేఖ

మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని ప్రజలకు సైతం ప్రత్యేకంగా లేఖ రాశారు రేవంత్ రెడ్డి. ప్రశ్నించే గొంతు లేకుండా పాలకులు కక్ష కట్టినప్పుడు.. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మల్కాజ్‌గిరి ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టిందన్నారు.

Advertisement
Update:2023-12-09 00:12 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం, సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో తన రాజీనామా లేఖను స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. డిసెంబర్‌ 8 నుంచే తన రాజీనామా అమల్లోకి వస్తుందంటూ లేఖలో పేర్కొన్నారు.

తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేశారు రేవంత్ రెడ్డి. ఎంపీ పదవికి మాత్రమే రాజీనామా చేశానని.. మల్కాజ్‌గిరి ప్రజలకు తన మనసులో శాశ్వత స్థానం ఉంటుందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కొడంగల్‌ తనకు చివరి శ్వాస అని.. మల్కాజ్‌గిరి తన ఊపిరి అని పేర్కొన్నారు.


మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని ప్రజలకు సైతం ప్రత్యేకంగా లేఖ రాశారు రేవంత్ రెడ్డి. ప్రశ్నించే గొంతు లేకుండా పాలకులు కక్ష కట్టినప్పుడు.. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మల్కాజ్‌గిరి ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టిందన్నారు. ఆరు నెలలు తిరగకముందే కేవలం 14 రోజుల వ్యవధిలో తనను గుండెల్లో పెట్టుకుందన్నారు రేవంత్. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్‌ జెండా ఎగిరిందంటే దానికి పునాదులు పడింది మల్కాజ్‌గిరిలోనే అని చెప్పారు. మల్కాజ్‌గిరికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు రేవంత్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News