రాహుల్‌ జీ.. అ'శోక' నగరాన్ని సందర్శించండి

2 లక్షల ఉద్యోగాలని హామీ ఇచ్చారు.. అందులో పది శాతం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-11-05 12:50 IST

హైదరాబాద్‌ పర్యటనకు వస్తోన్న రాహుల్‌ గాంధీ నిరుద్యోగుల గోడు తెలుసుకునేందుకు అశోక్‌ నగర్‌ ను సందర్శించాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు సూచించారు. ఎన్నికలకు ముందు అశోక్‌ నగర్‌ లో నిరుద్యోగులను కలిసిన ప్రదేశంలోనే కాంగ్రెస్‌ సో కాల్డ్‌ ప్రజాపాలన ఎలా ఉందో, విద్యార్థులు, నిరుద్యోగులపై ఎంత కర్కశంగా వ్యవహరించిందో తెలుసుకోవాలంటే అ'శోక' నగరానికి వెళ్లాలన్నారు. కాంగ్రెస్‌ ను గెలిపిస్తే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. వాటిలో కనీసం పది శాతం ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదని తెలపారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి పేరు మార్చడం తప్ప చేసిందేమి లేదన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పి.. జాబ్‌ లెస్‌ గా మార్చేశారన్నారు. పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళనకు దిగిన నిరుద్యోగుల వీపులు పగిలేలా లాఠీలతో దాడి చేయించారని అన్నారు. పది నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి, యువ వికాసం లాంటి పథకాల ఊసే లేదన్నారు. అశోక్‌ నగర్‌ కు వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడితే ఇక్కడి అరాచక పాలన గురించి రాహుల్‌ కు తెలిసి వస్తుందన్నారు.

Tags:    
Advertisement

Similar News