మోడీపై హైదరాబాద్ లో మళ్ళీ మొదలైన పోస్టర్ వార్!
మోడీకి మద్దతుగా నగరంలోని వివిధ బస్టాప్‌లలో "అమృత్ కాల్ బడ్జెట్‌కు మోడీజీ ధన్యవాదాలు - తెలంగాణ మధ్యతరగతి ప్రజలు" అని రాసి ఉన్న పోస్టర్లు మొదటగా వచ్చాయి.ఈ పోస్టర్ల పక్కనే, రెండు రోజుల తర్వాత, కేంద్ర బడ్జెట్‌పై ప్రధానిని విమర్శిస్తూ, వాటికి కౌంటర్‌గా పోస్టర్లు వచ్చాయి.
ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం హైదరాబాద్‌లో పర్యటిస్తారని ముందు ప్రకటించినప్పటికీ ఆ రోజు ఆయన పార్లమెంటు బడ్జెట్ సెషన్ కారణంగా రాలేకపోవచ్చని సమాచారం. రెండో సారి కూడా ఆయన హైద్రాబాద్ కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉంది. అయితే మోడీ వస్తున్నట్టు ముందు ప్రకటించిన వెంటనే హైదరాబాద్ లో ఆయనకు మద్దతుగా, వ్యతిరేకంగా పోస్టర్ వార్ మొదలైంది.
ప్రధాని హైదరాబాద్ పర్యటనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇతర రైల్వే ప్రాజెక్టుల ఆధునీకరణకు శంకుస్థాపన చేయాల్సి ఉంది.
కాగా, మోడీకి మద్దతుగా నగరంలోని వివిధ బస్టాప్‌లలో "అమృత్ కాల్ బడ్జెట్‌కు మోడీజీ ధన్యవాదాలు - తెలంగాణ మధ్యతరగతి ప్రజలు" అని రాసి ఉన్న పోస్టర్లు మొదటగా వచ్చాయి.
ఈ పోస్టర్ల పక్కనే, రెండు రోజుల తర్వాత, కేంద్ర బడ్జెట్‌పై ప్రధానిని విమర్శిస్తూ, వాటికి కౌంటర్‌గా పోస్టర్లు వచ్చాయి. పోస్టర్‌లపై 2014లో పూర్తిగా పెరిగిన జుట్టుతో ఉన్న వ్యక్తి , 2023లో బట్టతల ఉన్న వ్యక్తి చిత్రాలు ఉన్నాయి. ఇందులో “భారతదేశ వృద్ధి కథ – కలాకూట్ (విషపూరితమైన) బడ్జెట్ – బై బై మోడీ” అని రాశారు.
మోడీ హైదరాబాద్ కు వచ్చినా రాకున్నా ఆయన విధానాలకు సంబంధించి ఇప్పటికే అనేక సార్లు ఇలా పోస్టర్లు వెలిశాయి. గతంలో ఆయన సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ సభలో పాల్గొన్నప్పుడు ఆ గ్రౌండ్ చుట్టూ ఆయన విధానాలను ప్రశ్నిస్తూ పోస్టర్లు వెలిసి సంచలనం సృష్టించాయి.మోడీకి మద్దతుగా నగరంలోని వివిధ బస్టాప్‌లలో "అమృత్ కాల్ బడ్జెట్‌కు మోడీజీ ధన్యవాదాలు - తెలంగాణ మధ్యతరగతి ప్రజలు" అని రాసి ఉన్న పోస్టర్లు మొదటగా వచ్చాయి.ఈ పోస్టర్ల పక్కనే, రెండు రోజుల తర్వాత, కేంద్ర బడ్జెట్‌పై ప్రధానిని విమర్శిస్తూ, వాటికి కౌంటర్‌గా పోస్టర్లు వచ్చాయి.