ఏపీ పోలీసులపై పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

ఏపీ పోలీసు అధికారుల్లో చురుకుదనం తగ్గిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు . గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పవన్ అసహనం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2024-11-05 15:27 IST

పోలీసులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల్లో చురుకుదనం తగ్గిపోయిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పవన్ అసహనం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో మాజీ సీఎం జగన్‌ కుటుంబీకులు సరస్వతి సిమెంట్ కంపెనీ పేరుతో ఆక్రమించుకున్న భుములపై ఎంక్వయిరీ చేయాలని పవన్ డిమాండ్ చేశారు.

సిమెంట్‌ కంపెనీకి పర్యావరణ అనుమతులు కూడా లేవని ,30 సంవత్సరాలు లీజును జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక 50 సంవత్సరాలకు మార్చుకున్నారని దుయ్యబట్టారు. కట్టని సిమెంట్‌ కంపెనీకి 198 కోట్ల లీటర్ల కృష్ణ జలాలు మళ్లింపు కోసం రాసుకున్నారని ఆరోపించారు. సిమెంట్‌ కంపెనీని ఎందుకు చేపట్టలేదని, పరిహారం ఎందుకు అందించలేదు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉండేందుకు వచ్చామని తెలిపారు. రైతులను బెదిరించిన వారిపై పోలీసులు ఉపేక్షించవద్ధని అన్నారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును వేధించి చంపారని పవన్ ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News