వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ
ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.
వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా తాజాగా దేశంలో పేరొందిన పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించిన ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఆరు కంపెనీలు ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపారు.
దీంతో రాష్ట్రానికి దాదాపు రూ.5,260 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.