సిబ్బంది వచ్చినప్పుడు వివరాలను సిద్ధం చేసుకోండి : భట్టి

Prepare details for arrival of staff : Bhatti

Advertisement
Update:2024-11-06 16:55 IST

తెలంగాణలో అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశలు కల్పించడం మా ప్రభుత్వం లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ఇవాళ ప్రారంభమైంది. తాజాగా ప్రజా భవన్ లో భట్టి మీడియాతో మాట్లాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఆధార్, ధరణి, రేషన్ కార్డుల వివరాలను సిబ్బంది వచ్చినప్పుడు ప్రజలు అందుబాటులో ఉండాలని భట్టి విక్రమార్క కోరారు.

రాష్ట్రంలో ప్రజల ఆర్థిక పరిస్థితిని అంచన వేయడానికి రాజకీయ, ఆదాయ డేటాను సేకరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే సర్వే చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు కులగణన చేపట్టామని.. ఈ సర్వే ద్వారా శాస్త్రీయమైన సమాచారం అందుతుందని సమాచారం మయేరకు రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయం అందరికీ అందించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రజల వివరాలను గోప్యత ఉంటుందని భట్టి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News