రామన్నపేటలో ఉద్రిక్త పరిస్థితులు

సిమెంట్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న స్థానికులు, విపక్ష నేతలు. పలుచోట్ల బీఆర్‌ఎస్‌ నేతల గృహ నిర్బంధం

Advertisement
Update:2024-10-23 13:15 IST

రామన్నపేటలో అదానీ అంబుజా  సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సిమెంట్‌ పరిశ్రమను స్థానికులు, విపక్ష నేతలు వ్యతిరేకిస్తున్నారు. సిమెంట్‌ పరిశ్రమతో అన్నివిధాలుగా నష్టపోతామని 12 గ్రామాల ప్రజలు నిరసిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు రామన్నపేటలో సిమెంట్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు.అదానీ అంబుజా సిమెంట్‌ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు అందోళకు దిగారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 500 మందితో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అదానీ - అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న చిట్యాల శివారులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోలీసులు అరెస్ట్ చేశారు

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతూ..ప్రజలు పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఇంతటి నిర్బంధ పరిస్థితులను సృష్టించి నిర్వహించే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు విలువ ఉండదన్నారు. ఇదీ ముమ్మాటికీ అదానీ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ సాగిస్తున్న అరాచక పర్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వ విధానాలతో ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారని హెచ్చరించారు. 

Tags:    
Advertisement

Similar News