హయత్‌నగర్ పీఎస్‌లో ఎంపీ చామల, కాంగ్రెస్ నేతల హంగామా
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన వాహనాలను విజయవాడ జాతీయ రహదారి నడి రోడ్డు పై నిలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతిలో కొంత డబ్బు పెట్టి మార్ఫ్‌డ్ ఫొటో గ్రాఫ్ పెట్టి బీజేపీ గుజరాత్ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేయడానికి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి హయత్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేసిన అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే సాధారణ నేతలు పీఎస్‌లో మాట్లాడరు. బైటికి వచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతుంటారు. కానీ ఎంపీ, ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన తర్వాత స్టేషన్‌లోనే కూర్చుని మాట్లాడారు. పోలీసులు వీరి ప్రెస్‌మీట్‌కు అన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తున్నది. ఈ ప్రెస్‌మీట్ ప్రస్తుతం వివాదాస్పదమౌతున్నది. ఈ క్రమంలోనే హయత్ నగర్ లో కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహాన్నిప్రదర్శించారు. హయత్ నగర్ పోలీసు స్టేషన్ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన వాహనాలను
విజయవాడ జాతీయ రహదారి నడి రోడ్డు పై నిలిపారు. దీంతో నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆంబులెన్స్ కూడా ట్రాఫిక్‌లో ఇరుకున్నది. బాధ్యత గలిగిన ప్రజాప్రతినిధిగా ఉన్న చామల తన వాహనాలను రోడ్డుపైనే పెట్టడం, ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిన హంగామా వల్ల సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు పడ్డారు.