నా టార్గెట్ అదే

కాంగ్రెస్‌ లో 32 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని, కాంగ్రెస్‌ అంటేనే అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు హరీష్ రావు. రేగోడ్‌ మండలంలో బీఆర్‌ఎస్‌ కు మెజారిటీ ఇప్పిస్తే సంగారెడ్డి జిల్లాలో కలిపేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement
Update:2023-11-07 22:15 IST

ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తరపున పదికి పది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలనేదే తన లక్ష్యం అని అన్నారు మంత్రి హరీష్ రావు. ఆ దిశగా ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గాన్ని ఆయన టచ్ చేస్తున్నారు. మళ్లీ మళ్లీ అక్కడ సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లాలని అభ్యర్థులకు హితబోధ చేస్తున్నారు హరీష్ రావు.

పార్టీలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సవరించుకోవాలని నాయకులకు చెప్పారు హరీష్ రావు. ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకోవద్దని హెచ్చరించారు. ఎన్నికల టైమ్ లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆందోల్ లో నియోజకర్గ స్థాయి బూత్‌ కమిటీ సభ్యుల సమావేశానికి హజరైన ఆయన.. పార్టీలో విభేధాలుంటే సవరించుకుని పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలని చెప్పారు. కూర్చున్న కొమ్మను నరికితే ఇబ్బంది పడతామన్నారు.

ఈసారి 10కి 10

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10కి 10 ఎమ్మెల్యే సీట్లు గెలవాలని చెప్పారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్‌ ను గెలిపిస్తే ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోతాయని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు అన్నీ ఆగిపోతాయని చెప్పారు. ధరణిని కూడా తీసేస్తారని, రైతులకు మళ్లీ ఇబ్బందులు తప్పవన్నారు. కాంగ్రెస్‌ ను 11 సార్లు గెలిపిస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా అని ప్రశ్నించారు. మళ్లీ అలాంటి రోజుల్లోకి వెళ్దామా అన్నారు.

కాంగ్రెస్‌ లో 32 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని, కాంగ్రెస్‌ అంటేనే అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు హరీష్ రావు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒకటే లైన్, ఒక్కరే లీడర్‌ ఉంటారని, అంతా సాదాసీదాగా ఉంటుందన్నారు. రేగోడ్‌ మండలంలో బీఆర్‌ఎస్‌ కు మెజారిటీ ఇప్పిస్తే సంగారెడ్డి జిల్లాలో కలిపేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు హరీష్ రావు. 

Tags:    
Advertisement

Similar News