కరోనా వచ్చినప్పుడు కాంగ్రెసోళ్లు ఎక్కడున్నారు..?

బీజేపీవాళ్లు మోటార్లకు మీటర్లు అంటే, కాంగ్రెస్ వాళ్లు మూడు గంటలే కరెంట్ అంటున్నారని విమర్శించారు హరీష్ రావు. విరామం లేకుండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ను, విరామం లేకుండా గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

Advertisement
Update:2023-11-21 15:54 IST

కరోనా కష్టకాలంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. ఆనాడు ప్రజల అవసరాలు తీర్చింది, ఆదుకుంది బీఆర్ఎస్సేనని గుర్తు చేశారు. అసవరం ఉన్నప్పుడే కాంగ్రెస్ నేతలు ప్రజల వద్దకు వస్తారని, ఎన్నికల తర్వాత ఎవరూ కనిపించరని ఎద్దేవా చేశారు. ఎన్నికలు అంటే మూడు రోజుల పండగ కాదని, ఐదేళ్ల భవిష్యత్ అని వివరించారు. మన అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అన్నారు. హుస్నాబాద్ రోడ్ షో లో పాల్గొన్న హరీష్ రావు.. కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు.


కేసీఆర్ సీఎం అయ్యాకే హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు హరీష్ రావు. గతంలో ఎంతో మంది వచ్చి వెళ్లారు కానీ, నీళ్ళు ఇవ్వలేదు, రోడ్లు ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్ వల్ల కాళేశ్వరం పూర్తయిందని, శనిగరం ద్వారా నీళ్లు వస్తున్నాయని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి కర్నాటకలో ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు హరీష్ రావు. కర్నాటక ప్రజల పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే కైలాసం ఆటలో పాము మింగినట్టేనని చెప్పారు. ఆరు గ్యారెంటీలేమో కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఒకరు సీఎం అవుతారని ఎద్దేవా చేశారు.

బీజేపీవాళ్లు మోటార్లకు మీటర్లు అంటే, కాంగ్రెస్ వాళ్లు మూడు గంటలే కరెంట్ అంటున్నారని విమర్శించారు హరీష్ రావు. విరామం లేకుండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ను, విరామం లేకుండా గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ ని నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని చెప్పారు. పలువురు స్థానిక నేతల్ని ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. రాష్ట్రమంతా బీఆర్ఎస్ వేవ్ ఉందని.. తమ పార్టీ అభ్యర్థులను అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు హరీష్ రావు.

Tags:    
Advertisement

Similar News