రేవంత్ రెడ్డి డీఎన్ఏలో ఏముంది..?

రేవంత్ రెడ్డి డీఎన్ఏలో ఏబీవీపీ ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా.. అని అడిగారు.. ఆయన ఎన్ని పార్టీలు మారారు అని ప్రశ్నించారు. ముందు వారిద్దరి డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదని, ఆ సంగతి చూడాలని ఎద్దేవా చేశారు హరీష్ రావు.

Advertisement
Update:2023-10-21 17:46 IST

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే సత్తా తన డీఎన్ఏలో ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, మరి ఆయన పక్కన ఉన్న రేవంత్ రెడ్డి డీఎన్ఏలో ఏముందని సూటిగా ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి డీఎన్ఏలో ఏబీవీపీ ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా.. అని అడిగారు.. ఆయన ఎన్ని పార్టీలు మారారు అని ప్రశ్నించారు. ముందు వారిద్దరి డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదని, ఆ సంగతి చూడాలని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు హరీష్ రావు.


తల్లిని తిట్టినోడికి పదవి ఎలా ఇచ్చారు..?

సోనియా గాంధీని బలిదేవత అంటూ తిట్టిన రేవంత్ రెడ్డిని పిలిపి పీసీసీ పదవి ఇచ్చిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీకి పట్టిందన్నారు మంత్రి హరీష్ రావు. అప్పుడు ఓటుకు నోటు, ఇప్పుడు నోటుకి సీటు అంటూ కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్న విషయం రాహుల్ కి తెలియదా అని ప్ర‌శ్నించారు. అసలు కాంగ్రెస్ కి అభ్యర్థులే దొరకడం లేదని, అందుకే పక్క పార్టీలవారిని తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. రెండో జాబితా విడుదల చేయడానికి కూడా కాంగ్రెస్ దగ్గర అభ్యర్థులు లేరన్నారు.

విషయం లేదు.. విషం మాత్రమే

కాంగ్రెస్ పార్టీ దగ్గర విషయం లేదని, విషం మాత్రమే ఉందన్నారు హరీష్ రావు. రాహుల్ గాంధీ పేరు 'రాంగ్' గాంధీగా మార్చాలన్నారు. ఆయన ప్రచారం అంతా అబద్ధాలమయం అని చెప్పారు. ఛత్తీస్‌ఘడ్‌లో వడ్లు కొన్నామని రాహుల్ చెప్పడం అబద్ధమేనన్నాారు. కేవలం ఒక సీజన్లోనే కొన్నారని మరో సీజన్లో మొండిచేయి చూపించారన్నారు. కర్నాటకలో కరెండు కష్టాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. 11రోజులు అన్నం ముద్ద ముట్టకుండా తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ కి మాత్రమే దక్కుతుందని చెప్పారు హరీష్ రావు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అన్నారు. 


Tags:    
Advertisement

Similar News