కేసీఆర్ ది పనితనమే.. పగతనం కాదు

బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల టీమ్ అని మరోసారి స్పష్టం చేశారు హరీష్ రావు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎప్పటికీ ఒకటి కాదన్నారు. నూనె, నీరు ఎప్పుడైనా కలవడం చూశారా అని ప్రశ్నించారు.

Advertisement
Update:2023-10-24 18:32 IST

సీఎం కేసీఆర్ ది పనితనమే తప్ప ఆయనకు పగతనం లేదన్నారు మంత్రి హరీష్ రావు. పక్క రాష్ట్రాల్లో ఈ పగతనం చూస్తుంటామని చెప్పారాయన. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఒక పార్టీ గెలిస్తే, మరో పార్టీ నేతల్ని జైలుకి పంపించడం రివాజు అన్నారు. అలాగే వీరు గెలిస్తే వారిని జైలుకి పంపిస్తుంటారని, కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైలులో వేసేవారన్నారు హరీష్ రావు.


బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల టీమ్ అని మరోసారి స్పష్టం చేశారు హరీష్ రావు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎప్పటికీ ఒకటి కాదన్నారు. నూనె, నీరు ఎప్పుడైనా కలవడం చూశారా అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు కూడా అంతేనన్నారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో ఈనెల 30న సీఎం కేసీఆర్ సభ జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి హరీష్ రావు ఈ సమావేశంలో పాల్గొని బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు.

గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. అప్పట్లో కరెంటు కష్టాలను ఆయన అసెంబ్లీలో ఏకరువు పెట్టారని గుర్తు చేశారు హరీష్ రావు. ఆనాడు సోనియా గాంధీని, రేవంత్ రెడ్డి బలి దేవత, ఇటలీ బొమ్మ అన్నారని.. నోటికి ఏదోస్తే అది తిట్టారని చెప్పారు. ఇప్పుడు సోనియాగాంధీ దేవత అంటున్నారని.. రేవంత్ రెడ్డి ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం అని, ఆయన నోటికి మొక్కాలని ఎద్దేవా చేశారు. 

Tags:    
Advertisement

Similar News