భారీగా బీజేపీ సభ్యత్వ నమోదు.. ఈ నెల 30 వరకు పొడిగింపు

రాష్ట్రంలో 24 లక్షలకు బీజేపీ సభ్యత్వం చేరిందని మాజీ ఎమ్మెల్సీ, మెంబర్షిప్ రాష్ట్ర ఇంఛార్జి రామచంద్రరావు తెలిపారు.

Advertisement
Update:2024-10-22 17:46 IST

తెలంగాణ బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ మెంబర్‌షిప్ రాష్ట్ర ఇంఛార్జి రామచంద్రరావు అన్నారు. పండుగల కారణంగా కొంత నెమ్మదిగా సభ్యత్వ నమోదు జరుగుతున్నట్లు స్ఫష్టం చేశారు. మొత్తం 24 లక్షల మెంబర్‌షిప్ జరిగిందని అన్నారు. 4 లక్షల మిస్డ్ కాల్ మెంబర్షిప్, 20 లక్షలు ఆన్ లైన్ మెంబర్ షిప్ వచ్చిందని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా, జనవరి నాటికి బీజేపీకి నూతన జాతీయ అధ్యక్షుడు నియామకం ఉంటుందని అంటున్నారు. పలు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధ్యక్షులు..మారనున్నట్లు సమాచారం. పార్టీ సంస్థాగత ఎన్నికల కసరత్తు ప్రారంభించింది బీజేపీ.

సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ అధ్యక్షుడితో పాటు కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల పదవీకాలాన్ని పొడిగిస్తూ పార్టీ తీర్మానం చేసింది. ఇక వంద మెంబర్‌షిప్ చేసిన వారికి యాక్టివ్ మెంబర్‌షిప్ హోదా ఇస్తున్నామని, ఇప్పటిదాకా 9 వేల పై చిలుకు యాక్టివ్ మెంబర్‌షిప్ జరిగిందని, తెలంగాణలో 40 వేల యాక్టివ్ మెంబర్‌షిప్ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో యాక్టివ్ మెంబర్‌షిప్ ఉన్నవాళ్ళకి సంస్థాగత పదవులు వస్తాయని చెప్పారు. దళిత మోర్చా, మైనారిటీ మోర్చా స్పీడప్ చేయాల్సి ఉందని, సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేని చోట ఆఫ్‌లైన్ మెంబర్‌షిప్ నిర్వహణ చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇక ప్రజాస్వామ్య పద్ధతిలోనే అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని రామచంద్రరావు స్పష్టం చేశారు. 

Tags:    
Advertisement

Similar News