కిం కర్తవ్యం.. కేసీఆర్‌కు మహారాష్ట్ర నేతల లేఖ

బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మహారాష్ట్రలో పార్టీ నియమించిన ఆరుగురు కో-ఆర్డినేటర్లు ఇటీవల సమావేశమై.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

Advertisement
Update:2024-03-07 16:57 IST

బీఆర్ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు ఆ పార్టీ మహారాష్ట్ర విభాగం నేతలు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని స్థానాల్లో BRS పార్టీ పోటీ చేస్తుందో లేదో క్లారిటీ ఇవ్వాలన్నారు. ఈ విషయంపై వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని కోరారు.

బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మహారాష్ట్రలో పార్టీ నియమించిన ఆరుగురు కో-ఆర్డినేటర్లు ఇటీవల సమావేశమై.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ కేసీఆర్‌కు లేఖ రాశారు.


అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో పలు బహిరంగ సభలు నిర్వహించారు కేసీఆర్. అబ్‌ కి బార్‌ - కిసాన్‌ సర్కార్‌ నినాదంతో తెలంగాణ తర్వాత తన రాజకీయ క్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకున్నారు. ఎన్సీపీ, శివసేనకు చెందిన పలువురు కీలక నేతలు సైతం బీఆర్ఎస్‌లో చేరారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో BRS నేతలు విజయం సాధించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్‌ కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. దీంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ అధినేత వైఖరి ప్రకటిస్తే అందుకు అనుగుణంగా పని చేస్తామని లేఖలో స్పష్టం చేశారు నేతలు.

Tags:    
Advertisement

Similar News