కేటీఆర్ చెప్పిన ఆరు గ్యారెంటీలు.. కాంగ్రెస్ పై అదిరిపోయే పంచ్

కర్నాటకలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించి హామీల అమలుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం కిందామీదా పడుతోందని, అక్కడ కరెంటు కష్టాలు మొదలయ్యాయని, రాష్ట్రం నాశనం అయిపోతోందన్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ రావాలా అని ప్రశ్నించారు కేటీఆర్.

Advertisement
Update:2023-09-20 06:57 IST

పొరపాటునో, గ్రహపాటునో కాంగ్రెస్ కి ఓటు వేస్తే..

1. కటిక చీకట్లు, కరెంటు కష్టాలు పక్కా గ్యారెంటీ

2. తాగునీటి కష్టాలు, వీధి కుళాయిల దగ్గర పోరాటాలు గ్యారెంటీ

3. రైతన్నలు.. ఎరువులు, విత్తనాలకోసం కొట్లాడుకోవడం గ్యారెంటీ

4. రైతుబంధుకి రాం రాం, దళితబంధుకి జై భీమ్

5. ఏడాదికి ఒక ముఖ్యమంత్రి, రాజకీయ అస్థిరత పక్కా గ్యారెంటీ

6. తెలంగాణ రాష్ట్రం సంకనాకిపోవడం పక్కా గ్యారెంటీ

అంటూ అదిరిపోయే పంచ్ లు విసిరారు మంత్రి కేటీఆర్.


హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, ఆయన అనుచరులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీపై సెటైర్లు పేల్చారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు అని.. పొరపాటున కాంగ్రెస్ కి ఓటు వేస్తే తెలంగాణలో ఏం జరుగుతుందో చెబుతానని వివరించారు. ఆరు గ్యారెంటీలు జరుగుతాయని, అయితే అవి కాంగ్రెస్ చెప్పినవి కావని, తాను చెబుతున్నవేనని అన్నారు. కర్నాటకలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించి హామీల అమలుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం కిందామీదా పడుతోందని, అక్కడ కరెంటు కష్టాలు మొదలయ్యాయని, రాష్ట్రం నాశనం అయిపోతోందన్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ రావాలా అని ప్రశ్నించారు.

9 ఏళ్లలో తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో ద్రోహాలు చేసిందని మండి పడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడీ ఏర్పడక ముందే నిరంకుశ ఆలోచన విధానంతో ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి 5 మండలాలను ఏపీలో తీసుకెళ్లి కలిపేశారని అన్నారు. విభజన హామీలలో ఏ ఒక్కటీ అమలు కాలేదన్ననారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏమైందని ప్రశ్నించారు. ప్రజలంతా మోదీ భ్రమల్లోనుంచి బయటపడుతున్నారని, అందుకే ఆ పార్టీకి నాయకులు కూడా దూరమవుతున్నారని చెప్పారు. కిషన్ రెడ్డికి సిగ్గు, లజ్జ, రోషం ఉంటే.. ఉద్యోగాలకోసం నరేంద్రమోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ ప్రజల్ని మోసం చేశారని, అది కిషన్ రెడ్డికి గుర్తు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం రాజీనామా కూడా చేయని కిషన్ రెడ్డి ఇప్పుడు దిక్కుమాలిన ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

Tags:    
Advertisement

Similar News