చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని గోవాలో వివాహం చేసుకుంది.
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని గోవాలో వివాహం చేసుకుంది. హిందూ సంప్రదాయ ప్రకారం ఆమె వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో ఇరుకుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కీర్తి మెడలో ఆంటోనీ మూడుముళ్ల వేయడంతో వారు కొత్త ప్రయాణం మొదలైంది. వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో కొత్త దంపతులు పంచుకున్నారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఇవాళ సాయంత్రం మరోసారి వీరి పెళ్లి జరుగుతుంది. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లు తెలిపింది. ఆంటోనీ కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తుంది. కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కలిసే ఉన్న కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.