ఎస్‌ఎల్బీసీ ఫెయిల్యూర్‌ డిజైన్‌ అని కేసీఆర్‌ ఎప్పుడో చెప్పారు

రెస్క్యూ పనులు గాలికొదిలేసి సీఎం చక్కర్లు కొడుతున్నారు : కేటీఆర్‌

Advertisement
Update:2025-02-26 23:16 IST

ఎస్‌ఎల్బీసీ ఫెయిల్యూర్ డిజైన్‌ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ ప్రమాదంపై ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ''సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేటి సిగ్గు అన్నాదట.. అలావుంది రేవంత్ రెడ్డి వ్యవహారం.. ఎస్‌ఎల్బీసీ ప్రమాదం జరిగితే బాధ్యతగల ముఖ్యమంత్రివి అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్టి పెట్టేవాడివి… ఎన్నికలు, ఢిల్లీ టూర్ల అంటూ తిరిగే నీకు పాలన అంటే ఏంటో తెలుసా? ఎస్‌ఎల్బీసీ ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్‌ ఎప్పుడో చెప్పారు.. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చూసుడు కాదు… ఆ వీడియో చూడు…కొంచం అయినా విషయ పరిజ్ఞానం వస్తుంది.. అయినా పనులు ఆగిపోవడం వల్ల … బేరింగులు పనిచెయ్యడం లేదు అని అనడం ఏంటి.. అసలు పనులు మొదలు పెట్టడానికి ముందు టెక్నికల్ అసెస్మెంట్, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఏదైనా సర్వే చేశారా.. గుడ్డిగా కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారా.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని మేము డిమాండ్ చేస్తే దాని గురించి మాట్లాడడం మానేసి… ఈ పనికిమాలిన లీకులు, అక్కరకు రాని చిట్ చాట్లు దేనికి..'' అని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News