తమిళిసై రాజీనామా ఆమోదం.. తాత్కాలిక గవర్నర్‌గా రాధాకృష్ణన్
ఖాళీ అయిన తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను తాత్కాలికంగా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.;
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. తెలంగాణ గవర్నర్‌తోపాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ తమిళిసై అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తమిళిసై రాజీనామాతో ఈ రెండు పదవులూ ఖాళీ అయ్యాయి..
రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు
ఖాళీ అయిన తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను తాత్కాలికంగా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. ఆయన జార్ఖండ్‌తోపాటు ఈ బాధ్యతలు కూడా అదనంగా నిర్వర్తిస్తారు.
తెలంగాణకు కొత్త గవర్నర్‌ను ఎన్నుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొత్త గవర్నర్‌ను నియమించేవరకు ఆయనే ఈ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.