పోసానిపై పోలీసులకు కంప్లైంట్ చేసిన జనసేన..అరెస్ట్ ఖాయమేనా..?
సినీ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ మురళీ పై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు
సినీ రచయిత, నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేన నేతలు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. అయితే అప్పట్లో తాము పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని వారు వాపోయారు. సోషల్ మీడియా వేదిక గా పోసాని చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గు పడేలా ఉన్నాయన్నారు. జనసేన పార్టీ ఆంధ్రజోన్ కన్వీనర్ బాడిత శంకర్. వరుసగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంది.
గతంలో పోసాని పవన్ కళ్యాణ్ ఓ మెంటల్ కేసు.. అతని సభలకు వచ్చే జనం ఎవరూ ఓట్లు వేయరంటూ పోసాని విమర్శించారు. అప్పట్లో పోసాని వ్యాఖ్యలకు ఆగ్రహానికి గురైన జనసేనుకులు ఆయనపై కేసులు పెట్టారు. వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. పోసానికి ఉచ్చు బిగుసుకుంటోంది. పైగా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన కూడా పోసాని నోటి దూకుడు తగ్గడం లేదు. కూటమి ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయన అరెస్ట్ ఖాయమనే రాజకీయ వర్గల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.