ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావు : హరీశ్‌రావు
నటుడు అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ పట్లా అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహాంతో ఉన్నారని తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడని హరీశ్‌రావు అన్నారు. కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ బ్రదర్ టార్చర్ వల్ల ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు దానిపై కనీసం కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే,రేవంత్ రెడ్డి కనీసం దాని మీద మాట్లాడలేదు. 500 మంది రైతులు, 80 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే మాట్లాడటానికి రేవంత్‌రెడ్డికి సమయం లేదు.
కానీ సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉంది’అని హరీశ్‌రావు అన్నారు.ప్రశ్నించే గొంతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నది. భౌతిక దాడుల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రశ్నించకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంస్కృతి తెలంగాణలో ఎప్పుడూ లేదు. రాయలసీమ తరహా ఫ్యాక్షనిస్టు సంస్కృతిని తెలంగాణలో తెచ్చి రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్‌ను కుప్పకూలుస్తున్నడు. ఈ సంస్కృతిని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు హర్షించరు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు.