మా కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోం
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హెచ్చరిక
మా కార్యకర్తలపై దాడులు చేస్తూ ఊరుకోబోమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హెచ్చరించారు. తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. గోమారంలోని మా ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు కావాలనే దాడి చేశారు. మా ఇంటి ముందు కావాలనే టపాసులు కాల్చారు. ఇంట్లోకి వచ్చి ఇద్దరిపై దాడి చేశారు. మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చి ఇలా చేయడంపై ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించారు. ఇంటిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మా కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి అన్నారు.
సునీతా లక్ష్మారెడ్డి యోగక్షేమాలు తెలుసుకున్న కేటీఆర్
సునీతా లక్ష్మారెడ్డి యోగక్షేమాలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. సునీతా లక్ష్మారెడ్డితో కేటీఆర్ మాట్లాడారు. ఘటన వివరాలను, ఎమ్మెల్యే యోగక్షేమాలను తెలసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీతా లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేమన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలన్నారు. ఎన్ని అరాచకాలకు పాల్పడినా.. 60 లక్షల మంది బీఆర్‌ఎస్ కుటుంబం ప్రజాప్రతినిధి నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటుదన్నారు.