హైడ్రా కూల్చివేతలు.. బాధితుల ఆర్తనాదాలు

సీఎం కుటుంబసభ్యులకు ఓ న్యాయం.. సామాన్యులకు మరో న్యాయమా? అని ప్రశ్న

Advertisement
Update:2024-09-22 17:27 IST

హెచ్‌ఎండీఏ పరిధిలోని మూడు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా ప్రకటించింది. సుమారు ఎనిమిది ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నల్లచెరువు పరిధిలో 16 వాణిజ్య షెడ్లను, ప్రహరీ గోడలు కూల్చివేసినట్లు హైడ్రా పేర్కొన్నది. అయితే ఎటువంటి నోటీసులు లేకుండా కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని, బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కనీస సమయం ఇవ్వమని కోరినా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. రేవంత్‌ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తుందా? అని విలపించారు. మీరు ఉంటే బాగుంటుందని ఓట్లు వేశాం. ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదని బాధితులు రోదించారు. తాము కిరాయికి ఉన్నామని, తన కోడలు ఐదేండ్ల తర్వాత ప్రెగ్నెంట్‌ అని రెండు నెలలు సమయం ఇవ్వాలని కోరినా అధికారులు వినలేదన్నారు. కూల్చివేయడం వల్ల అందులో ఉన్న ఒక్క సామాను పనిచేయకుండా పోయిందన్నారు. సామాను పనికి వస్తుందని అవి తీసుకునే వరకైనా ఆగాలని ఓ బాధితుడి విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సామాన్యులకు మాత్రం సమయం  ఇవ్వకుండా ఇండ్ల కూల్చివేస్తున్నదనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

Tags:    
Advertisement

Similar News