గ్రీన్ నీడిల్: సిరిసిల్ల నుంచి న్యూయార్క్ కు

ఇక్కడ తయారైన 'గ్యాప్' కంపెనీ బాక్సర్లు ఇప్పుడు న్యూయార్క్ కి ఎగుమతి అవుతున్నాయి. మేడిన్ సిరిసిల్ల దుస్తులు న్యూయార్క్ మార్కెట్ కి వెళ్తున్నందుకు మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2023-06-30 06:15 IST

మేడిన్ సిరిసిల్ల దుస్తులు న్యూయార్క్ కి ఎగుమతి అవుతున్నాయి. ఇది చాలా సంతోషకరమైన సందర్భం అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సిరిసిల్లలోని అపెరల్ పార్క్ లో ఉన్న గ్రీన్ నీడిల్ సంస్థ ద్వారా ఈ ఎగుమతి జరుగుతోంది. 'గ్యాప్' కంపెనీకి చెందిన బాక్సర్లు మొదటి డెలివరీకోసం బయలుదేరాయి. ముంబై పోర్ట్ నుంచి ఇవి న్యూయార్క్ కి చేరుకుంటాయి. ఇకనుంచి మేడిన్ సిరిసిల్ల బాక్సర్లు న్యూయార్క్ లోని కస్టమర్లకు అందుబాటులో ఉంటాయనమాట.

సిరిసిల్లలో 60 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అపెరల్ పార్క్ ఏర్పాటైంది. దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ అపెరల్ పార్క్ లో ఉన్న కంపెనీల్లో దాదాపు 80శాతం మంది మహిళలే ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల్లో చాలామంది అపెరల్ పార్క్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. బీడీ కార్మికుల సమస్యకు కూడా ఈ పార్క్ ద్వారా శాశ్వత పరిష్కారం లభించినట్టయింది. తాజాగా అపెరల్ పార్క్ నుంచి ఎగుమతులు కూడా మొదలయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

సిరిసిల్లలో ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తిని మొదలు పెట్టాయి. గోకుల్ దాస్ ఇమేజెస్ సంస్థ ఇక్కడ దుస్తుల తయారీ మొదలు పెట్టింది. గ్రీన్ నీడిల్ కూడా సిరిసిల్ల అపెరల్ పార్క్ లో తమ యూనిట్ నెలకొల్పింది. వస్త్ర రంగంలో దిగ్గజ సంస్థ 'గ్యాప్' గ్రీన్ నీడిల్ కి ప్రధాన కస్టమర్. ఇక్కడ తయారైన 'గ్యాప్' కంపెనీ బాక్సర్లు ఇప్పుడు ఎగుమతి అవుతున్నాయి. నేరుగా ఇవి న్యూయార్క్ కి వెళ్తాయి. మేడిన్ సిరిసిల్ల దుస్తులు న్యూయార్క్ మార్కెట్ కి వెళ్తున్నందుకు మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఎగుమతులకు సిరిసిల్ల కంపెనీలు సిద్ధం అవుతున్నాయని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News