రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
జనవరి నెల నుంచి రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.
Advertisement
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. జనవరి నెల నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నారు. ఈ సన్న బియ్యం జనవరి 2025 నుంచి రేషన్ షాపుల్లో పంపిణి చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారని ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు రేషన్ కార్డులు అందలేదని.. తమ ప్రభుత్వ హయాంలో తప్పకుండా అమలు చేస్తామన్నారు.
Advertisement