బీఆర్ఎస్‌కు గుడ్‌న్యూస్.. రైతుబంధుకు ఈసీ అనుమతి..!
ఈసీ నిర్ణయంతో గత కొద్ది రోజులుగా రైతుబంధు నిధుల విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడినట్లయింది.
Advertisement
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ న్యూస్ చెప్పింది ఎలక్షన్ కమిషన్. యాసంగి పంటకు సంబంధించి రైతు బంధు నిధుల విడుదలకు ఓకే చెప్పింది. ఈసీ నిర్ణయంతో గత కొద్ది రోజులుగా రైతుబంధు నిధుల విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడినట్లయింది.
రైతుబంధు నిధుల విషయమై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రైతుబంధు నిధుల విడుదల ఆపాలంటూ కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని బీఆర్ఎస్ ఆరోపించగా.. ప్రభుత్వం దగ్గర నిధులు లేక సాకులు చెప్తోందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
ప్రస్తుతం ఎకరాకు ఏటా రూ. 10 వేల రైతుబంధు సాయం అందిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు సాయాన్ని రూ.12 వేలు చేస్తామని.. తర్వాత దశలవారీగా పెంచుతూ ఎకరాకు రూ.16 వేలు అందిస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది.
Advertisement