ఓడిపోయిన వారికోసం కొత్త చట్టం..!
సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కూడా ఓడిపోయిన అభ్యర్థులకు ప్రొటోకాల్ మర్యాదలు ఇవ్వాలని, ఆమేరకు ప్రభుత్వం చట్టం తేవాలని కోరారు సబిత.
తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేగా తనకు ప్రొటోకాల్ గౌరవం లేకుండా చేసి, ఓడిపోయిన అభ్యర్థి, అందులోనూ మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థికి అధికారిక కార్యక్రమంలో చోటివ్వడాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఫిరాయింపులపై ఈరోజు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓడిపోయిన వారికోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చట్టం తేవాలన్నారు.
ఓడిపోయిన వారిని కూడా అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించే చట్టం తీసుకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తన నియోజకవర్గంలో ఓడిపోయిన అభ్యర్థికి గౌరవం ఇచ్చారని, తనను పక్కనపెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పని అన్ని నియోజకవర్గాల్లో చేయాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయిన అభ్యర్థులకు గౌరవం ఇవ్వాలన్నారు. వారిని కూడా స్టేజ్ పైకి పిలిచి సీటివ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కూడా ఓడిపోయిన అభ్యర్థులకు ప్రొటోకాల్ మర్యాదలు ఇవ్వాలని, ఆమేరకు కొత్త ప్రభుత్వం చట్టం తేవాలని కోరారు సబిత. కాంగ్రెస్ ఓడిపోయిన చోట పరాజితులకు దక్కుతున్న ప్రొటోకాల్ మర్యాదలపై ఆమె తనదైన శైలిలో కౌంటర్లిచ్చారు.
ఈరోజు అసెంబ్లీ స్పీకర్ ని కలసి ఫిరాయింపులపై చర్యలు తీసకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అదే సమయంలో ప్రజా ప్రతినిధులకు జరుగుతున్న అవమానాలను కూడా వారు అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇటీవల కౌశిక్ రెడ్డికి కూడా ఇలాంటి అవమానమే జరిగిందని, తన నియోజకవర్గంలో కూడా ఓడిపోయిన అభ్యర్థిని స్టేజ్ పైకి పిలిచారని చెప్పారామె. చివరకు పోలీసులు కూడా అడ్జస్ట్ అయిపోవాలంటూ చెబుతున్నారని, ఇదెక్కడి సంప్రదాయం అని మండిపడ్డారు మాజీ మంత్రి సబిత.