దశాబ్ది సంబరం: నేడు విద్యుత్ విజయోత్సవం

నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పును సభలలో వివరిస్తారు. ఈరోజే సింగరేణి సంబురాలు కూడా జరుగుతాయి.

Advertisement
Update:2023-06-05 07:25 IST

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నాలుగో రోజుకి చేరుకున్నాయి. తొలిరోజు ఆవిర్భావ దినోత్సవం, రెండో రోజు రైతు దినోత్సవం, మూడో రోజు సురక్షా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నాలుగో రోజు విద్యుత్ విజయోత్సవం జరుపుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేలా, ఆ విజయాల్లో ప్రజలను భాగస్వాముల్ని చేసేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు.

నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పును సభలలో వివరిస్తారు. ఈరోజే సింగరేణి సంబురాలు కూడా జరుగుతాయి. ఇప్పటికే అన్ని సబ్‌ స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. సబ్‌ స్టేషన్ల వద్ద ప్రజలు, రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రం విద్యుత్తు కష్టాలను ఏవిధంగా అధిగమించిందో రైతులకు వివరిస్తారు. విద్యుత్ రంగ విజయాలను వివరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యుత్ రంగం అనతి కాలంలోనే తన ప్రత్యేకత చాటుకుంది. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ తోపాటు, గృహ, పారిశ్రామిక అవసరాలకు 24గంటల నిరంతరాయ విద్యుత్ ని అందిస్తున్నారు. రైతుల ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాదీ చేస్తున్న ఖర్చు రూ.12 వేల కోట్లు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో.. విద్యుత్ రంగంలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం రూ.75 వేల కోట్లు ఖర్చు చేసింది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ విజయాలన్నిటినీ ప్రజలకు మరింత వివరంగా తెలియజేస్తారు. విద్యుత్ విజయోత్సవాలు నిర్వహిస్తారు.

Tags:    
Advertisement

Similar News