ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడం లేదా ?
ఈసీకి తెలంగాణ రాష్ట్రం ఉన్నదనే విషయం తెలియదా ? లేక గుర్తించడం లేదా ? లేక హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదని ఎన్నికల సంఘం బావిస్తోందా ? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘమే ఇంత అజ్ఞానంలో ఉంటే ఎలా ?అని నెటిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ టీఆరెస్ పెట్టుకున్న దరఖాస్తును కేంద్ర ఎన్నికల్ సంఘం ఆమోదించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు ఈసీ లేఖ రాసింది. ఇక్కడి వరకు వ్యవహారం బావుంది. అయితే ఆ లేఖలో ఈసీ రాసిన అడ్రస్ వ్యవహారం వివాదాస్పదమయ్యింది.
ఈ సీ రాసిన లేఖలో...
To
The President,
Telangana Rashtra Samithi,
House No. 8-2-220/110/1/3, Road No.14,
Banjara Hills, Hyderabad,
Andhra Pradesh-500034.
అని రాసి ఉంది. అంతే కాదు ఈ లేఖను ఈసీ తెలంగాణ ఎన్నికల సంఘానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కూడా పంపింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈసీకి తెలంగాణ రాష్ట్రం ఉన్నదనే విషయం తెలియదా ? లేక గుర్తించడం లేదా ? లేక హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదని ఎన్నికల సంఘం బావిస్తోందా ? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘమే ఇంత అజ్ఞానంలో ఉంటే ఎలా ? అని నెటిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాదు లేఖను తెలంగాణ ఎన్నికల సంఘంతోపాటు ఏపీ ఎన్నికల సంఘానికి ఎందుకు పంపించినట్టు ? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ లేఖను ఏపీకి పంపినట్టే మిగతా రాష్ట్రాలకు ఎందుకు పంపలేదనే వాదనలు వినపడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికే తెలంగాణ, ఏపీల గురించి అవగాహన లేకపోతే ఎలా ? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.