బీజేపీని ఓడించడం కోసమే మునుగోడులో టీఆరెస్ కు మద్దతు .. సీపీఐ రాష్ట్ర కమిటీ ప్రకటన‌

మునుగోడు ఉప ఎన్నికపై ఎట్టకేలకు సీపీఐ అధికారిక ప్రకటన వచ్చింది. టీఆరెస్ కు మద్దతు ప్రకటిస్తూ ఆ పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది.

Advertisement
Update:2022-08-20 13:07 IST

మునుగోడు ఉపఎన్నికల్లో టీఆరెస్ కే మద్దతు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ కార్యదర్శి చాడా వెంకట రెడ్డి ప్రకటించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు ప్రగతిశీల శక్తులు కలిసి పోరాడతామని కేసీఆర్ ప్రకటించారని, అందువల్ల ఆ పార్టీతో కలిసి పోరాడుతామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసునని, అటువంటి పరిస్థితిలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చినా బీజేపీని ఓడించలేమని ఆయన అన్నారు.

అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకునే టీఆరెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని చాడా వెంకటరెడ్డి తెలిపారు. ఈ రోజు మునుగోడులో జరిగే టీఆరెస్ బహిరంగ సభలో సీపీఐ నాయకుడు పల్లా వెంకట రెడ్డి పాల్గొంటారని చాడా తెలిపారు. 

టీఆరెస్ కు మద్దతు ఇవ్వడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యవర్గం వ్యతిరేకిస్తోందనే వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.మునుగోడు ఉప ఎన్నికపై ఎట్టకేలకు సీపీఐ అధికారిక ప్రకటన వచ్చింది. టీఆరెస్ కు మద్దతు ప్రకటిస్తూ ఆ పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది.

Tags:    
Advertisement

Similar News