కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీలో 29 మందికి చోటు..

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సీనియర్లు అందరికీ దాదాపు ఈ కమిటీలో చోటు కల్పించారు.

Advertisement
Update:2023-07-20 20:23 IST

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సిద్ధపడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల విజయంతో మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం అనేక వ్యూహాలు సిద్ధం చేస్తోంది. నిన్న, మొన్నటి వరకు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న నాయకులు కూడా.. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ఐక్యతారాగం వినిపిస్తున్నారు. తాజాగా, ఎన్నికలకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చైర్మన్‌గా 29 మంది సభ్యుల కమిటీని ప్రకటించారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సీనియర్లు అందరికీ దాదాపు ఈ కమిటీలో చోటు కల్పించారు. తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపని మహ్మద్ అజారుద్దీన్, ఇన్నాళ్లూ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రేణుకా చౌదరి, కొత్తగా పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఈ కమిటీలో చోటు కల్పించారు. గతంలో గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కమిటీలో ఎవరెవరు ఉండాలనే చర్చ జరిగింది. అప్పుడే ముసాయిదా జాబితాను అధిష్టానానికి పంపించారు. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. ఈ కమిటీకి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నియామకాన్ని ఖరారు చేస్తూ ట్వీట్ చేసింది. కాగా, ఈ కమిటీ విధివిధానాలు ఏమిటో ఇంకా బయటకు వెల్లడించలేదు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కమిటీ - 2023

1. రేవంత్ రెడ్డి (చైర్మన్)

2. మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ లీడర్

3. టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ

4. జగ్గారెడ్డి, ఎమ్మెల్యే

5. బొమ్మా మహేశ్ కుమార్ గౌడ్

6. డాక్టర్. జే. గీతారెడ్డి

7. మహ్మద్ అజారుద్దీన్

8. అంజన్ కుమార్ యాదవ్

9. కుందూరు జానారెడ్డి

10. వి. హనుమంతరావు

11. పొన్నాల లక్ష్మయ్య

12. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ

13. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ

14. దామోదర రాజనర్సింహా

15. మధు యాష్కి గౌడ్

16. దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే

17. చల్లా వంశీచంద్ రెడ్డి

18. ఎస్ఏ. సంపత్ కుమార్

19. రేణుకా చౌదరి

20. పొరిక బలరామ్ నాయక్

21. పోదెం వీరయ్య, ఎమ్మెల్యే

22. ధనసరి అనసూయ (సీతక్క), ఎమ్మెల్యే

23. మహ్మద్ షబ్బీర్ అలీ

24. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

25. ప్రేమ్ సాగర్ రావు

26. సునితారావు ముదిరాజ్

27. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ (ఎక్స్ అఫీషియో)

28. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు (ఎక్స్ అఫీషియో)

29. స్టేట్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ (ఎక్స్ అఫీషియో)

Tags:    
Advertisement

Similar News