రండి, పెట్టుబడులు పెట్టండి.. ఎన్నారైలకు సీఎం రేవంత్ పిలుపు

తెలంగాణలో పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుందని, మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2024-08-05 10:27 IST

ప్రవాస భారతీయులే అమెరికాకు ఆయువు పట్టు అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్యాములు కావాలన్నారు. తెలంగాణలో పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుందని, మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి.

మాట నిలబెట్టుకున్నా..

గతేడాది టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో అమెరికాకు వచ్చానని, వచ్చేసారి సీఎంగా వస్తానన్న తన మాటను నిలబెట్టుకున్నానని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని చెప్పారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని వారికి వివరించారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. భవిష్యత్తు ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు రేవంత్ రెడ్డి. తమ పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదని చెప్పారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు వస్తుందని చెప్పారు. యువతకు ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యమిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. "మీ నైపుణ్యాలు, మీ ప్రతిభా పాటవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారు. ఇకపై తెలంగాణకు మీ సేవలు కావాలి. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్ తో పాటు, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నాం. మీ వంతుగా పెట్టుబడులు పెట్టండి." అని ఎన్నారైలను కోరారు సీఎం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్టు వారికి వివరించారు. హైదరాబాద్ అభివృద్ధిలో అందరూ కలసి రావాలన్నారు రేవంత్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News