సుప్రీంకోర్టుకు సీఎం రేవంత్ క్షమాపణ

బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తి కోర్టు తీర్పును ఎలా తప్పుపడతారంటూ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడింది.

Advertisement
Update: 2024-08-30 05:17 GMT

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి ట్వీట్ ఇదే -

భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉంది. ఆగస్టు 29, 2024 రోజు కొన్ని పత్రికలు.. నేను న్యాయస్థానం విజ్ఞతను ప్రశ్నిస్తున్నాను అనే కోణంలో వార్తలు రాశాయి. నాకు న్యాయప్రక్రియపై గట్టి విశ్వాసం ఉందని మరోసారి స్పష్టం చేస్తున్నాను. పత్రికలలో వచ్చిన వార్తల పట్ల బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని ధృడంగా విశ్వసించే వ్యక్తిగా న్యాయవ్యవస్థపై గౌరవాన్ని, విశ్వాసాన్ని కొనసాగిస్తాను.



ఇంతకీ ఏం జరిగిందంటే..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బీజేపీ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేయడం వల్లే బెయిల్ వచ్చిందని, ఇందుకోసం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం జరిగిందని రేవంత్‌ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తి కోర్టు తీర్పును ఎలా తప్పుపడతారంటూ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటి కామెంట్స్‌ను తాము పట్టించుకోమని, మనస్సాక్షి ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలతో మాట్లాడి మేము తీర్పులు ఇస్తామా అంటూ ఎదురు ప్రశ్నించింది.

Advertisement

Similar News