తెలంగాణలోకి వచ్చామని ఎలా తెలుస్తుందంటే..?

తెలంగాణ‌లో గ‌తంలో ఎప్పుడూ గోదావ‌రి పుష్క‌రాలు జ‌ర‌గ‌లేదని.. తెలంగాణ ఉద్య‌మం ప్రారంభ‌మైన త‌ర్వాత, బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ బ్ర‌హ్మాండంగా పుష్క‌రాలు జ‌రుపుకుంటున్నామని తెలిపారు సీఎం కేసీఆర్.

Advertisement
Update:2023-11-03 15:50 IST

ఎక్కడినుంచయితే నున్నటి రోడ్లు మొదలవుతాయో అక్కడినుంచి తెలంగాణలోకి ఎంటరైనట్టు, ఎక్కడినుంచయితే 24 గంటల కరెంటు మొదలవుతుందో.. అప్పుడు తెలంగాణలోకి ప్రవేశించినట్టు అని తేడా వివరించి చెప్పారు సీఎం కేసీఆర్. 70 ఏళ్ల క్రితం ఏర్పడిన మహారాష్ట్ర, మనకంటే పెద్ద నగరం ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్రలో ప్రజలు మనకంటే సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. అక్కడి రైతులు తెలంగాణకు వచ్చి భూములు కొనుక్కోని వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ముథోల్ నియోజకవర్గం భైంసాలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న ఆయన.. అభ్యర్థి విఠల్ రెడ్డిని గెలిపించాలని కోరారు.


Full View

అభివృద్ధి కొనసాగాలంటే..?

కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, రైతుబంధు ఇవ్వరని, రేట్లు పెరిగిపోతాయని, ధరణి రద్దు చేస్తారని.. చెప్పారు సీఎం కేసీఆర్. పక్క పార్టీల నేతలు ఓట్లకోసం వస్తే ప్రతి ఊళ్లో చర్చ జరగాలన్నారు. వారు వస్తే ఏం చేస్తారు, ఇప్పటి వరకూ ఇచ్చినవన్నీ ఆపేస్తారా అని అడగాలన్నారు. ఆలోచించి అనుకూలమైన నాయకుడిని ఎన్నికోవాలని చెప్పారు. బీఆర్ఎస్ కి ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందన్నారు కేసీఆర్.

తెలంగాణ‌లో గ‌తంలో ఎప్పుడూ గోదావ‌రి పుష్క‌రాలు జ‌ర‌గ‌లేదని.. తెలంగాణ ఉద్య‌మం ప్రారంభ‌మైన త‌ర్వాత, బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ బ్ర‌హ్మాండంగా పుష్క‌రాలు జ‌రుపుకుంటున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. బాస‌ర సరస్వతీదేవి ఆల‌య అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడే సమయానికి తెలంగాణ ఆగమాగంగా ఉందని, మూడు నాలుగు నెలలు మేథోమథనం చేసి ఓ అజెండా తయారు చేసుకున్నామని, వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 

Tags:    
Advertisement

Similar News