న్యాయమూర్తి ఎదుటే మేకులు మింగేశాడు.. - జైలులో వేధిస్తున్నారంటూ ఫిర్యాదు
అతని పేరు రాఘవులు నరసింహ (34). హైదరాబాదులోని విద్యానగర్, నల్లకుంట ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై నివాసముంటాడు. మెట్రో స్టేషన్ల దగ్గర యాచిస్తుంటాడు. ఒక హత్య కేసు, దోపిడీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్నాడు.
అతనో రిమాండు ఖైదీ. ఓ హత్య, దోపిడీ కేసులో అరెస్టయ్యాడు. చర్లపల్లి జైలులో రిమాండులో ఉన్నాడు. సోమవారం మరో ఇద్దరు రిమాండు ఖైదీలతో పాటు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, విచారణ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అరుస్తూ.. జైలు అధికారులు తనను వేధిస్తున్నారని, ఘోరంగా అవమానిస్తున్నారని, వెంటనే మరో కారాగారానికి మార్చాలంటూ.. తనతో తెచ్చుకున్న మేకులను న్యాయమూర్తి ఎదుటే మింగేశాడు. దీంతో న్యాయమూర్తి వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఈ ఘటన జరిగింది. అతన్ని వెంటనే ఎల్బీ నగర్ పోలీసులు అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
అతని పేరు రాఘవులు నరసింహ (34). హైదరాబాదులోని విద్యానగర్, నల్లకుంట ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై నివాసముంటాడు. మెట్రో స్టేషన్ల దగ్గర యాచిస్తుంటాడు. ఒక హత్య కేసు, దోపిడీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్నాడు.
నిందితుడి ఆరోపణను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి దీనిపై విచారణకు ఆదేశించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవిని విచారణాధికారిగా నియమించారు. మంగళవారం ఆమె చర్లపల్లి జైలును సందర్శించి వివరాలు సేకరించారు.