ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని ప్రజల మీదకొచ్చిన విషయాన్ని మరిచిపోగలమా..?

తెలంగాణ కోసం అందరూ పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్న సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని ప్రజల మీదకు వచ్చాడని.. ఈ విషయాన్ని మరిచిపోతామా..? అని కవిత అన్నారు.

Advertisement
Update:2023-11-15 17:38 IST

అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని, రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కనీసం ప్రజలను పట్టించుకుంటారా..? అనే విషయంపై జ‌నాలు ఆలోచించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం ఆమె బోధన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ హవా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయి.. దక్షిణాదిన రికార్డు సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశారని, ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఎక్కడ ఉన్నాయని కవిత ప్రశ్నించారు. తెలంగాణ కోసం అందరూ పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్న సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని ప్రజల మీదకు వచ్చాడని.. ఈ విషయాన్ని మరిచిపోతామా..? అని కవిత అన్నారు. రైతుబంధు రైతులకు వేసే బిచ్చమంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పింఛను, బీమా అందిస్తుంటే వృథాగా ఇస్తున్నార‌ని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇలాంటి నాయకులు రేపు అధికారంలోకి వస్తే ప్రజలను పట్టించుకుంటారా..? సంక్షేమ పథకాలు అమలు చేస్తారా..? అని ప్రశ్నించారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేశారని, ఆ సమయంలో ఆయన ఒక్క చెరువుకు కూడా మరమ్మతు చేయలేదని విమర్శించారు. బోధన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సీఎంకేసీఆర్ అండతో నిజాంసాగర్ కాలువల ఆధునీకీకరణకు ఎంతో కృషి చేశారని, ఎన్నో చెరువులను బాగు చేశారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News