అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు సభనుంచి బయటకు వచ్చారు.

Advertisement
Update:2024-07-24 12:32 IST

తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. నిరుద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం కోరుతూ నోటీసులు ఇచ్చింది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటనతోపాటు ఇతర డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. నిరుద్యోగుల ఆందోళనలు, ప్రభుత్వ అణచివేత వైఖరిపై కూడా చర్చ చేపట్టాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాన్ని అనుమతించకపోవడంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.


నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు సభనుంచి బయటకు వచ్చారు. ప్లకార్డులు పట్టుకుని నిరుద్యోగులకు మద్దతుగా నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇదే నిదర్శనం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందని అన్నారు హరీష్ రావు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 



Tags:    
Advertisement

Similar News